క్రైమ్/లీగల్

గృహిణి ఆత్మహత్య కేసులో భర్త, అత్తమామలకు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 11: గృహిణిపై వేధింపులు, ఆత్మహత్య కేసులో ఆమె భర్త, అత్తమామలకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు తీర్పుచెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా గూడూరు మండలం ఆకుమర్రు గ్రామానికి చెందిన బొల్లా లక్ష్మికి విద్యాధరపురానికి చెందిన పామర్తి శ్రీ్ధర్‌తో 2015 మార్చి 7న పెళ్లి జరిగింది. ఆ సమయంలో ఎకరం పొలం, రూ. 3.75 లక్షలు నగదు, ఐదు కాసుల బంగారం కట్నం కింద ఇచ్చారు. కొద్దిరోజులు కాపురం చేశాక పుట్టింటికి వెళ్లి మరింత కట్నం తేవాల్సిందిగా భర్త, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ తండ్రి నాగ నరసింహరావుకు చెప్పి వాపోయింది. ఈక్రమంలో 2015 సెప్టెంబర్ 13న రాత్రి తన కుమార్తె వద్దకు వెళ్లేసరికి బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ చనిపోయి ఉందని, తన కుమార్తెను కట్నం తీసుకురమ్మని భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధించారని, దీంతో బలవన్మరణం చెందిందని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి భర్త పామర్తి శ్రీ్ధర్, మామ జానకీరామయ్య, అత్త పార్వతిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున పోలీసులు ప్రవేశపెట్టిన 15మంది సాక్షులను విచారించారు. నిందితులపై నేరం రుజువుకావడంతో భర్తకు మూడేళ్లు జైలు, 500 జరిమానా, మిగిలిన ఇద్దరికి ఏడాది చొప్పున జైలు, 500 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు.