తెలంగాణ

‘సమత’ ఘటనపై కదలిన సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: ‘దిశ’ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేయగా ఇదే తరహాలో గతనెల 24న ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలో సమతపై సామూహిక అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా హతమార్చిన ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో అలజడి రేపుతోంది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తరహాలోనే సమత ఉదంతంలోనూ నిందితులను బహిరంగంగా ఉరితీయాలని జిల్లాలోని ఏజెన్సీప్రాంత ప్రజలు, మహిళలు అందోళన సాగిస్తుండడంతో పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించింది. జిల్లా ఎస్పీ మల్లారెడ్డి స్పందిస్తూ హత్యాచారానికి పాల్పడిన ఎల్లాపటార్‌కు చెందిన షేక్‌బాబు, షేక్ షాబొద్దిన్, షేక్ మగ్దుమ్‌లపై పీడీయాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, గ్యాంగ్‌రేప్ కేసులు నమోదు చేయడమే గాక నిందితులపై 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బాధితురాలు టేకు లక్ష్మి పేరును సమతగా మారుస్తూ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామానికి చెందిన సమతను కిరాతకంగా హతమార్చిన ఘటనపై ప్రభుత్వం స్పందించడం లేదని, ఇందుకు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఇటీవల ఎమ్మెల్యే రేఖానాయక్‌ను నిలదీశారు. అంతేగాక జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాలకు చెందిన మహిళలు, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా ర్యాలీలు తీసి నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని, సీపీ సజ్జనార్‌ను ఈ కేసును దర్యాప్తు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు అందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సమత పిల్లలు నరేందర్, సిద్ధార్థ్‌లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇచ్చోడలోని గురుకుల పాఠశాలలో చేర్పించి ప్రత్యేక వసతులు కల్పించారు. అంతేగాక ఆసిఫాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే రేఖానాయక్ విన్నపం మేరకు ప్రభుత్వం రెవెన్యూ శాఖలో సమత భర్త టేకు గోపికి అటెండర్ ఉద్యోగం కల్పిస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ హన్మంత్ ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానంలో ఐదవ అదనపు సెషన్స్ ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేయడమే గాక సత్వర న్యాయం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.