క్రైమ్/లీగల్

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దిశను రేప్ చేసి హతమార్చిన నలుగురు కిరాతకుల ఎన్‌కౌంటర్‌పై స్వతం త్ర దర్యాప్తుకు ఆదేశించాలంటూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వాజ్యాలను బుధవారం వినేందు కు సుప్రీం కోర్టు అంగీకరించింది. తెలంగాణ పోలీసులు డిసెంబర్ ఆరో తేదీ జరిపిన ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలంటూ న్యాయవాదులు
జి.ఎస్.మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్. ఏం.ఎల్.శర్మలు రెండు ప్రజా ప్రయోజన వాజ్యాలను దాఖలు చేయటం తెలిసిందే. తాము దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై వెంటనే విచారణ జరపాలని ఇద్దరు న్యాయవాదులు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బాబ్డే నాయకత్వంలోని బి.ఆర్.గవై,సూర్యకాంత్ ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు దీనిపై ఇది వరకే విచారణ ప్రారంభించింది కదా అని బాబ్డే సూచించగా హైకోర్టు తీసుకున్న కోణం వేరు తాము తమ పిటిషన్‌లో ప్రస్తావించిన అంశం వేరని ఇద్దరు న్యాయవాదులు వాదించారు. ఇద్దరు న్యాయవాదులు చేసిన వాదనతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి బాబ్డే రేపు దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. హైకోర్టు ఇందుకు సంబంధించిన ఏ అంశాలపై విచారణ జరుపుతోందనేది కూడా పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి సూచించారు.