క్రైమ్/లీగల్

మరణించేంత వరకు జైలులోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాసరగోడ్, డిసెంబర్ 4: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక అత్యాచారానికి పాల్పడిన 46 ఏళ్ల వ్యక్తికి ఇక్కడి సెషన్స్ కోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ముద్దాయి సహజ మరణం పొందేంత వరకు కారాగార శిక్ష అనుభవించాలని సెషన్స్ కోర్టు జడ్జి పీఎస్ శశికుమార్ తీర్పు చెప్పారు. అలాగే ముద్దాయి వీఎస్ రవీంద్రన్ రూ. 25వేల జరిమానా చెల్లించాలని కూడా జడ్జి తన తీర్పులో ఆదేశించారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోస్కో) చట్టానికి 2018 ఏప్రిల్‌లో సవరణ చేసిన తరువాత ఆ చట్టం ఆధారంగా కేరళ రాష్ట్రంలో తీర్పు వెలువడిన తొలి కేసు ఇది. ‘్భరత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 376 ఏబీ కింద ముద్దాయికి మరణించేంత వరకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది’ అని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. 12 ఏళ్లలోపు బాలికను రేప్ చేసిన వ్యక్తికి విధించవలసిన శిక్షను ఐపీసీలోని సెక్షన్ 376 ఏబీ నిర్దేశిస్తోంది. 12ఏళ్ల లోపు వయసు గల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారికి 20 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష విధించాలని ఈ సెక్షన్ పేర్కొంటోంది. అంతేగాకుండా సదరు ముద్దాయి సహజ మరణం పొందేంత వరకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించొచ్చని పేర్కొంటోంది. ఈ జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించొచ్చని పేర్కొంటోంది. 2018 అక్టోబర్ తొమ్మిదో తేదీన ఈ అత్యాచార ఘటన జరిగింది. నిందితుడు తన పొరుగింటి బాలిక స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు నిందితుడు అంతకు ముందు కూడా ఆ బాలికపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడనే విషయం ఈ సందర్భంగా బయటపడింది.