క్రైమ్/లీగల్

మహిళపై అత్యాచారం, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ పోలవరం, డిసెంబర్ 3: ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న 55 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమేకాక, చీర మెడకు చుట్టి ఊపిరి ఆడకుండాచేసి హత్యచేసి, ఇంట్లో నగదు దోచుకున్న అమానుష ఘటన తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం జి వేమవరం గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. హైదరాబాద్ దిశ హత్యాచారంపై దేశవాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలోనే వెలుగుచూసిన ఈ ఘటన సమాజంలోని మానవ మృగాల విపరీత పోకడలను ఎత్తిచూపుతోంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... ఐ పోలవరం మండలం జి వేమవరం గ్రామంలో చాకలి చెరువుగట్టు వద్ద కేశనకుర్తి నాగమణి (55) అనే మహిళ ఒంటరిగా నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి మహిళ ఇంటి తలుపు గడియ వంచి, లోనికి ప్రవేశించిన ముష్కరులు ఆమెపై అత్యాచారంచేసి, హత్యచేశారు. చీర మెడకు చుట్టి ఊపిరి ఆడకుండాచేసి, హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటనపై క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ముమ్మిడివరం సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. మృతురాలు పడివున్న మంచంపైన గదిలోను నిందితులు కారంపొడి చల్లడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరుూం అద్నాం అస్మీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టివుంటారని భావిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు.
నిందితుడిపై గ్రామస్థుల దాడి
కాగా మధ్యాహ్నం 3గంటల సమయంలో నిందితుల్లో ఒకరైన కేశనకుర్తి నాగబాబు (30)ను విచారణ నిమిత్తం ఘటనా స్థలానికి తీసుకువస్తుండగా గ్రామస్థులు అతనిపై దాడికి దిగారు. తాను ఒక్కడినే ఈ దురాగతానికి పాల్పడినట్టు నాగబాబు చెబుతుండటం విశేషం. పోలీసులు అతడిని గ్రామస్థుల బారినుండి కాపాడి, పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కేశనకుర్తి నాగబాబు (30) అనే వ్యక్తిని మంగళవారం సాయంత్రం అరెస్టుచేశామని మంగళవారం రాత్రి పోలీసులు ఒక ప్రకటన విడుదలచేశారు. నాగమణిపై అత్యాచారానికి పాల్పడి, హత్యచేసి, ట్రంకు పెట్టెలో ఉన్న నగదు అపహరించాడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అతడి నుండి రూ.78,900 నగదు స్వాధీనం చేసుకున్నామని, ముమ్మిడివరం కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు.
* మృతురాలు నాగమణి (ఫైల్‌ఫొటో)