క్రైమ్/లీగల్

పెద్ద వాగులో పడి ఇద్దరు అన్నదమ్ముల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయిలకొండ , డిసెంబర్ 3:దేశ రాజధాని ఢిల్లీలో జీవనం కొనసాగిస్తూ సొంత గ్రామంలో అక్క వివాహానికి వచ్చి పెళ్లి జరిగిన మూడో రోజే ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు కోయిల్‌సాగర్ పెద్ద వాగులో పడి మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కోయలకొండ మండలంలో చోటు చేసుకుంది. కోయిలకొండ ఎసై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం కానుగుబండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని కల్యాణ్‌నగర్ తండాకు చెందిన రాందాస్ తన భార్య పిల్లలతో కలిసి ఢిల్లీలో అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్త్తెలు, ఇద్దరు కొడుకులు. ఢిల్లీలోనే పెద్ద కొడుకు సంజయ్ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు బిఫార్మసీ చదువుతున్నాడు. చిన్న కూతురు ఎంబిబిఎస్ చదువుతోంది. తమ దగ్గరి బంధువుతో తన పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయించి కుటుంబ సభ్యులు అందరూ కల్యాణ్‌నగర్ తండాకు వచ్చారు. ఈనెల 1న వివాహం ఘనంగా జరిపించారు. మంగళవారం మధ్యాహ్నం సంజయ్ (30), ప్రవీణ్ (28) తన తల్లి అంజలి, తండాకు చెందిన డీక్యానాయక్, ప్రకాశ్‌లతో కలిసి కోయిల్‌సాగర్ పెద్ద వాగు వద్దకు చేరుకున్నారు. అక్కడే తన మామ పొలంలో పండిన పంటను ఆరపెట్టడానికి పెద్ద బండపై పరచిన వరి ధాన్యాన్ని సైతం కొద్ది సేపు దగ్గరగా ఆరబెట్టారు. ఇక వాగులో లోతును గమనించకపోవడంతో ఇద్దరు అన్నదమ్ములు సంజయ్, ప్రవీణ్ కాలుజారి బండపై నుండి వాగులో పడ్డారు. అది గమనించిన తల్లి అంజలి, డీక్యానాయక్, ప్రకాశ్ ఇద్దరినీ కాపాడటానికి వాగులో దిగారు. వారికి సైతం ఈత రాకపోవడంతో భయంతో కేకలు పెట్టారు. అదే సమయంలో దేవరకద్ర మండలం రాజమూరు గ్రామానికి చెందిన చిన్న బుచ్చన అటుగా ప్రయాణిస్తూ అరుపులు గమనించి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అంజలిని వాగులోంచి చీరతీసి అతనికి ఇవ్వడంతో అంజలి, డీక్యానాయక్, ప్రకాశ్‌లను చీరపట్టుకోమని చెప్పి వారిని ఒడ్డుకు చేర్చి వారి ప్రాణాలు కాపాడాడు. ఇక సంజయ్, ప్రవీణ్ అప్పటికే ప్రాణాలు వాగులో మునిగి ప్రాణాలు వదిలారు. కల్యాణ్‌నగర్ తండా ప్రజలతో పాటు వందల సంఖ్యలో వాగుకు చేరుకున్నారు. తండా యువకులు ఇద్దరినీ వాగులోంచి బయటకు తీశారు. ఆ ప్రాంతం రోదనలతో నిండిపోయింది. ఎస్సై సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పూర్తిస్థాయిలో పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. తన కూతురు వివాహం జరిగి మూడు రోజులు దాటకముందే ఇద్దరు చేతికి వచ్చిన కొడుకులు మృతి చెందడం మండలంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

*చిత్రాలు.. మృతులు ప్రవీణ్, సంజయ్