క్రైమ్/లీగల్

మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: పాతబస్తీలో ఓ పోలీసు కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఈశ్వరయ్య ఫలక్‌నుమా పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి షంషీర్‌గంజ్ గోశాల రోడ్డులో హల్‌చల్ చేశాడు. రోడ్డుపై తూలి పడిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కానిస్టేబుల్‌ను పక్కకు జరగాలని వాహనాదారులు కోరగా, వాళ్లపైనా చిందులు తొక్కాడు. కానిస్టేబుల్ వీరంగం మొత్తాన్ని మొబైల్‌లో వాహనదారుడు రికార్డు చేశాడు. తర్వాత ఈశ్వరయ్య ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కానిస్టేబుల్ ఈశ్వరయ్యను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని పట్టించుకోకుండా విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్‌కు మెమో జారీ చేశారు.