క్రైమ్/లీగల్

నడి రోడ్డుపై కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 3: బంజారాహిల్స్ రోడ్డుపై ఓ కారు దగ్ధం అయింది. మంగళవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 మీదుగా ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిని గమనించేలోపే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ శ్రావణ్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి దిగి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఫైరింజన్లు వచ్చే లోపే పెద్ద ఎత్తున మంటలు కమ్ముకొని కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనతో రద్దీగా ఉండే రోడ్ నెంబర్ 2లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఎవరికి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.