క్రైమ్/లీగల్

ఆ తహశీల్దార్ అక్రమాస్తులు రూ. 10 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 3: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన కర్నూలు జిల్లా సంజామల తహశీల్దార్ గోవింద్‌సింగ్ అక్రమాస్తులు రూ. 10 కోట్లు అని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో ఉన్న తహసీల్దార్ గోవింద్‌సింగ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు లభించాయి. ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా గత అక్టోబర్ 7వ తేదీ
తహసీల్దార్ గోవింద్‌సింగ్ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అదే రోజు అధికారులు ఆయన ఇంట్లో ఆకస్మిక దాడులు జరిపి పలు ఇంటి, ప్లాట్ల పత్రాలను గుర్తించారు. దీంతో కలెక్టర్ గోవింద్‌సింగ్‌ను సస్పెండ్ చేశారు. కోర్టు అనుమతితో మంగళవారం ఏసీబీ అధికారులు మరోమారు తహసీల్దార్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 ఇళ్ల స్థలాల పత్రాలు, 450 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 43.5 లక్షల నగదు, రూ. 1.09 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ. 13 లక్షల షేర్‌మార్కెట్ బాండ్లు, ఒక కారు, ఒక ద్వి చక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2.5 కోట్లుగా అంచనా వేసినట్లు డీఎస్పీ తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ. 10 కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. తహసీల్దార్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచనున్నారు.

*చిత్రం...తహశీల్దార్ గోవింద్‌సింగ్ ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలు, ప్లాట్ల పత్రాలు