క్రైమ్/లీగల్

చిదంబరం బెయిల్‌పై నేడు సుప్రీం తీర్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడి యా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం బెయిల్ మంజూరుపై సుప్రీం కోర్టు బుధవారం తీర్పును వెలువరించనుంది. న్యాయమూర్తి ఆర్ బానుమతి నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 28న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. బెయిల్ కోసం చిదంబరం చేసుకున్న పిటిషన్‌ను గత నెల 15న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. 74 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నేతకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదిస్తోంది. తీహార్ జైలులో ఉన్న చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో కీలకమైన వ్యక్తి అని ఈడీ కోర్టుకు తెలిపింది. కాగా అవాస్తవ, తప్పుడు అభియోగాలతో ఈడీ తన ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పేరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మనీలాండరింగ్ అన్నది తీవ్రమైన ఆర్థిక నేరమని, జాతీయ సంపదపైనే కాకుండా ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేదిగా పేర్కొంటూ చిదంబరానికి బెయిల్ ఇవ్వొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. సాక్షులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చిదంబరం ప్రభావితం చేసినట్టు ఒక్క ఆధారం చూపలేకపోయారని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. అక్టోబర్ 22న సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అక్టోబర్ 16న చిదంబరాన్ని తీహార్ జైలులోనే అరెస్టు చేశారు. దీంతో సీబీఐ కేసులోబెయిల్ వచ్చినా విడుదలకు నోచుకోలేదు.
ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు విదేశీ నిధులు వచ్చేలా చిదంబరం సహకరించారన్నది అభియోగం. అప్పట్లో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అదే ఏడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది.