క్రైమ్/లీగల్

ఆ తీర్పును పునఃసమీక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. బాబ్రీ మసీదును కూల్చివేసిన వారికి బహుమతి ఇచ్చినట్టుగా తీర్పు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. తీర్పును పునఃసమీక్షించాలని అయోధ్య స్థల వివాదంలో అసలు కక్షిదారుడు సిద్దిఖీ చట్టబద్ధమైన వారసుడు వౌలాలా సయ్యద్ అషాద్ రషీదీ ఆరోపించారు. సిద్దిఖీ యూపీ జమైత్ ఉల్మా ఈ హింద్ అధ్యక్షుడు. ఆయననే అసలు కక్షిదారుడు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గతనెల 9న అయోధ్య వివాదాస్పద స్థలంపై తీర్పును ప్రకటించింది. మొత్తం 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని ‘రాంలల్లా’కు అప్పగిస్తూ అక్కడ రామమందిరం నిర్మించుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే అయోధ్యలోనే విలువైన ఐదెకరాల భూమిని మసీదు నిర్మించుకునేందుకు సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది. అయితే సుప్రీం తీర్పు ఏకపక్షంగా ఉందని బాబ్రీ మసీదు కూల్చివేసిన వారికే ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. ఈమేరకు న్యాయవాది ఇజాజ్ మఖ్బూల్ ద్వారా సోమవారం రివ్యూ పిటిషన్ వేయించారు. వివాదాస్పద స్థలం 2.77 ఎకరాల్లో రామమందిరం నిర్మించాలన్న బెంచ్ తీర్పుపై తాత్కాలిక స్టే ఇవ్వాలని వౌలానా కోరారు. ముస్లింలు ఎవరూ ప్రార్థనలు చేయని ప్రాంతంలో మసీదు నిర్మాణానికి భూమి ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. మసీదును వివిధ సందర్భాల్లో కూల్చివేసిన హిందూ సంస్థలకు ప్రయోజనం చేకూరేదిగా సుప్రీం కోర్టు తీర్పు ఉందని పిటిషనర్ ఆరోపించారు. మసీదును కూల్చివేయడాన్ని ఖండించిన సుప్రీం కోర్టు ధర్మాసనం దాడి చేసిన వారికే వివాదాస్పద స్థలం ఎలా అప్పగించిందని వౌలానా ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు తప్పులతడకగా ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేసిన చోట రామమందిరం నిర్మించుకోవచ్చని బెంచ్ ఎలా చెబుతుంది?. దీనిపై పునసమీక్ష జరగాలి’అని సిద్దిఖీ వారసుడు డిమాండ్ చేస్తున్నారు. ‘1934లో మసీదు గుమ్మటాలు(డూమ్స్)ను ధ్వంసం చేశారు. 1949లో బాబ్రీ మసీదుపై దాడికి దిగారు. 1992లో మసీదును ధ్వంసం చేశారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాబ్రీ మసీదుపై జరిగిన దాడుల పరంపర చట్టవిరుద్ధమైందని సుప్రీం కోర్టు ఓ పక్క ఖండిస్తూ, ఎవరైతే దుశ్చర్యకు పాల్పడ్డారో వారికే వివాదాస్పద స్థలాన్ని బహుమతిగా ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ పార్టీలకు హక్కులను మంజూరు చేయడం ద్వారా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారికి సర్వోన్నత న్యాయస్థానం మేలు చేసిందని పిటిషనర్ ఆరోపించారు. అలాగే సివిల్ దావాలో కళంకిత వ్యాజ్య కారణాన్ని సమర్ధించ కూడదన్న పిటిషనర్ ‘ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు తప్పుల తడకగా’ అభివర్ణించారు.