క్రైమ్/లీగల్

పెళ్లింట్లో భారీ చోరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, డిసెంబర్ 2: సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో ప్రముఖ వ్యాపారవేత్త రాచకొండ శ్రీనివాస్‌రావు గృహంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు భారీ చోరీకి పాల్పడ్డారు. సుమారు 423 గ్రాముల బంగారు అభరణాలు, 3 లక్షలకు పైగా నగదుతో పాటు మొత్తం సుమారు 20 లక్షల సొత్తును అపహరించుకొని పోయారు. బాధితుడు శ్రీనివాస్‌రావు వివరాల ప్రకారం తన కుమార్తె మానస వివాహం హైద్రాబాద్‌లో నిర్వహించడానికి ఆదివారం సాయంత్రం నేరేడుచర్ల నుండి హైద్రాబాద్‌కు బంధువులతో, మిత్రులతో ఇంటికి తాళం వేసి వెళ్లారు. దీనిని పసికట్టిన దొంగలు గృహానికే వెళ్లే షట్టర్ తాళం బద్ధలుగొట్టి లోపలికి ప్రవేశించి మొదటి అంతస్తులో ఉన్న ఇంటి తాళం పగలగొట్టి బెడ్‌రూంలో ఉన్న బీరువాను సైతం పగలగొట్టారు. ఈ విషయం సోమవారం ఉదయం పాలు సరఫరా చేసే వ్యక్తి గమనించి హైద్రాబాద్‌లో ఉన్న శ్రీనివాస్‌రావుకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వెలుగులోకి వచ్చింది. హైద్రాబాద్‌లో ఉన్న శ్రీనివాస్‌రావు కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం గృహానికి చేరుకొని పరిశీలించగా బెడ్‌రూంలో ఉన్న బీరువాను పగలగొట్టి అందులో ఉన్న వైట్‌స్టోన్ నక్లెస్, గుండ్ల హారం, చంద్రహారం, చైన్లు, చెవుల రింగులు, రుద్రాక్షగొలుసు, నల్లపూసల గొలుసు, చేతి కడియాలు, బ్రాస్‌లెట్, చిన్నపిల్లల గాజులు, ఉంగరాలు, లాకెట్లు, జడ పువ్వు, చెవుల బుట్టలు, దుద్దులు సుమారు 423 గ్రాముల బంగారు అభరణాలు, 3 లక్షలకు పైగా నగదును అపహరించుకొని పోయారు. తాము వివాహం కోసం హైద్రాబాద్‌కు వెళ్లగా జరిగిన దొంగతనం తెలుసుకొని దిగ్భ్రాంతిలో ఉన్నామని ఏఏ వస్తువులు అపహరించుకొని పోయారో, ఎంత నగదు అపహరించుకొని పోయారో పూర్తి స్థాయిలో తెలుపలేక పోతున్నామని ప్రస్తుతం ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని పూర్తిస్థాయిలో 1, 2 రోజుల్లో గృహాన్ని పరిశీలించి వివరిస్తామని బాధితులు పేర్కొన్నారు. గృహంలో ఉన్న 3 బెడ్ రూంలలో ఉన్న కప్‌బోర్డులను పగలగొట్టి వస్తువులను చిందరవందర చేశారు. దొంగతనానికి పాల్పడిన సంఘటనను పరిశీలిస్తే నలుగురైదుగురు వ్యక్తులు చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కూతురి వివాహం జరిపించడం కోసం వెళ్లిన సమయంలో దొంగతనం జరగడం పట్ల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అంతే కాకుండా అపహరించుకుని పోయన బంగారు అభరణాల్లో బంధువులవి కూడా ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు క్లూస్ టీమ్‌ను, డాగ్ స్కాడ్ బృందాలు పరిశీలించి వేలిముద్రలు సేకరించగా తగు రీతిలో వేలిముద్రలు లభించ లేదని బహుశా దొంగలు చేతులకు గ్లౌజులు వేసుకొని ఉండవచ్చని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. సంఘటన స్ధలాన్ని కోదాడ డీఎస్‌పీ రఘు, హుజూర్‌నగర్ సీఐ రాఘవరావు, నేరేడుచర్ల ఎస్‌ఐ యాదవేంద్రారెడ్డి, క్రైమ్ కంట్రోల్ సీఐ నిరంజన్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.