క్రైమ్/లీగల్

ఖమ్మంలో పట్టుబడిన దొంగల్లో నగరవాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (క్రైం), డిసెంబర్ 2: పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తెలంగాణలోని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇన్నోవా కారులో గుంటూరు జిల్లా కేశనపల్లికి చెందిన రాయపాటి వెంకన్న, కృష్ణా జిల్లా విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన మునగాల జయరాం అనుమానాస్పద స్థితిలో పట్టుబడ్డారని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం, వైరాలో పలు చోరీలు పాల్పడినట్లు వెల్లడించారన్నారు. వీరి నుంచి రూ. 60 లక్షల విలువైన 267 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 కేజీల వెండి వస్తువులు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు. వీరిపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్టల్రో చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి సీపీ రివార్డులు ప్రకటించారు. సమావేశంలో అదనపు డీసీపీలు మురళీధర్, ఇంజారపు పూజ, ఏసీపీ గణేష్, సీసీఎస్ సీఐ జి రవి, త్రీటౌన్ సీఐ శ్రీ్ధర్, సీసీఎస్ ఏఎస్‌ఐ జి కృష్ణారావు, హెడ్ కానిస్టేబుల్ లతీఫ్, ఆర్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు బి మంగిత్యా, వి నాగేశ్వరరావు, రామకృష్ణ పాల్గొన్నారు.