క్రైమ్/లీగల్

ప్రేమ జంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, డిసెంబర్ 2: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం షాబాద్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడలో జరిగింది. షాబాద్ ఇన్‌స్పెక్టర్ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన మహేందర్(25) అదే గ్రామానికి చెందిన కర్రె పల్లవి(19) రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం గతంలో పెద్దలకు తెలియడంతో మందలించి విదిలేశారు. ప్రేమికులు ఎవ్వరికి తెలియకుండ అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిస్తే గొడవలు అవుతాయని, పెద్దలు ఎంత చెప్పిన వినిపించుకోవడం లేదని ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా ఆదివారం రాత్రి ఇద్దరు కలిసి గ్రామ శివారు ప్రాంతంలోని పంట పొలంలోని మామిడి చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.