క్రైమ్/లీగల్

గంజాయి తరలింపు గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, డిసెంబర్ 2: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఇద్దరు వ్యక్తులను సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.7లక్షల విలువైన 45 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఎస్పీ అనురాధ ఆదేశాల మేరకు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో సోమవారం సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌గా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి, ఇద్దరు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని ప్రతాప్ బట్టల మిల్లులో పనిచేసే బిహార్‌కు చెందిన సంతోష్ కుమార్ సింగ్(32), రాహుల్ వర్మ(23)గా గుర్తించారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు దిల్లీకి చెందిన ధీరజ్ ఆదేశాల మేరకు ఎవరికి అనుమానం రాకుండా లగేజీ బ్యాగులలో విశాఖపట్నంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయిని తీసుకొని దిల్లీలో అందిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ఐదు బ్యాగులలో 13ప్యాకెట్లలో 45కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు బీ.ప్రమోద్ కుమార్, బెన్నయ్య, ఆర్.శ్రీనివాస్, సయ్యద్ షబ్బీర్‌ను ఎస్పీ ప్రశంసించారు.