క్రైమ్/లీగల్

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట), డిసెంబర్ 1: గుంటూరు నగర శివారు అడ్డాగా విదేశాల నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేసుకుని నగరంలోని యువత, కళాశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నల్లపాడు స్టేషన్ పరిధిలోని అపార్ట్‌మెంట్లు కేంద్రంగా టాంజానియా, సిరియా, యెమెన్ దేశాల నుంచి డ్రగ్స్‌ను తెప్పించి ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 600 గ్రాముల మత్తు పదార్థాలు, 2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. సౌత్ యెమెన్ దేశానికి చెందిన మహమ్మద్ షాద్ అహ్మద్ తాడేపల్లిలోని యూనివర్శిటీలో బీబీఏ చదువుతున్నాడు. అక్కడే విద్యనభ్యసిస్తున్న సూడాన్‌కు చెందిన మిన్ని, టాంజానియాకు చెందిన యోనా అనే ఇద్దరు విదేశీయులతో కలిసి వారి దేశాల నుంచి మాదకద్రవ్యాలు తెప్పిస్తూ విక్రయిస్తున్నారు. వీరు ముగ్గురూ గుంటూరు నగరానికి చెందిన షరీఫ్, సూరి, సూర్య, అవినాష్ అనే వ్యక్తులతో కలిసి నల్లపాడులోని ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి ఆన్‌లైన్ ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు. నల్లపాడు పోలీసులు తనిఖీల్లో భాగంగా అపార్ట్‌మెంట్లను పరిశీలిస్తున్న సమయంలో అనుమానించి విచారించగా, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు బయటపడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. మత్తు పదార్థాలను నగరంలోని యువకులు, కళాశాలల విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు వారు అంగీకరించారు. వారి వద్ద నుంచి విదేశీ డ్రగ్స్‌తో పాటు 2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రామకృష్ణ తెలిపారు. వీసా గడువు ముగిసినా వెళ్లకుండా దేశంలో అక్రమంగా నివాసం ఉంటుండటంతో వీసా యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాల్ని నాశనం చేసుకోవద్దని, పిల్లల కదలికలపై తల్లిదండ్రులు కనే్నసి ఉంచాలని ఈసందర్భంగా ఆయన సూచించారు.
ఇద్దరు విదేశీయులతో పాటు గుంటూరు నగరానికి చెందిన నలుగురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలేఖరుల సమావేశంలో అదనపు ఎస్పీలు కమలాకర్, సౌత్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, నల్లపాడు సీఐ వీరాస్వామి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.