క్రైమ్/లీగల్

దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 1: దొంగ నోట్లను చలామణీ చేస్తున్న ఓ ముఠా గుట్టును ఎంవీపీ పోలీసులు బయటపెట్టారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుండి రూ.2,96,100ల విలువైన నకిలీ నోట్లను, రూ. ఏడు వేలు అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లాలోని చోడవరం ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సయ్యద్ ముజిబుర్ రెహమాన్ కలిసి 1.3శాతం నిష్పత్తితో దొంగనోట్లను చలామణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులైన కే. నాగవెంకట సత్యనారాయణ, బీ. పద్మారావు కలిసి కారుడ్రైవర్ ఆర్.జయరామ్ సహాయంతో చోడవరంలో ఇద్దరు రెహమాన్లను కలిసి 1.17 లక్షల అసలు నోట్లు అందజేసి, మూడు లక్షల నకిలీ నోట్లను తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఇక్కడి హెచ్‌బికాలనీ సమీపంలోగల స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌వద్ద నోట్లను మార్చుకోవడానికి సిద్ధమవుతుండగా సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు వెంటనే దాడి చేసి సత్యనారాయణ, పద్మారావు, జయరామ్‌ను అదుపులోకి తీసుకుని నకిలీ నోట్లతోపాటు అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులైన రెహమాన్లు పరారీలో ఉన్నట్టు సీపీ మీనా తెలిపారు.