క్రైమ్/లీగల్

ప్రాణహితలో నాటు పడవ మునక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూరు, డిసెంబర్ 1: ప్రాణహిత నదిలో నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతైన సంఘటన కొమురంభీం జిల్లా చింతలమానెపెల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత నదిలో చింతలమానెపెల్లి మండలం గూడెం ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో ఆదివారం నాటుపడవ మునిగి ఇద్దరు బీట్ అధికారులు గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం పెట్రోలింగ్ కోసం ముగ్గురు బీట్ అధికారులు సద్దాం, సురేష్, బాలకృష్ణలతో పాటు పడవ నడిపే వ్యక్తి లింగయ్య, అర్జయ్య, కత్తరయ్య నాటు పడవలో వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో ప్రాణహితలో నీటి ప్రవాహం ఎక్కువై నాటు పడవలో చేరిపోవడంతో నాటు పడవ బోల్తాపడింది. బీట్ అధికారి సద్దాంతో పాటు లింగయ్య, అర్జయ్య, కత్తరయ్యలు సురక్షితంగా ప్రాణాలతో బయటపడగా, సురేష్, బాలకృష్ణ నాటు పడవ మునిగి గల్లంతయ్యారు. బాలకృష్ణ కాగజ్‌నగర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, సురేష్ కెరమెరి మండలానికి చెందిన వ్యక్తి. ఇద్దరు బీట్ ఆఫీసర్లు గల్లంతు కావడంతో ప్రాణహిత నది గూడెం రేవుకు తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు చేరుకొని రెస్క్యూ టీమ్‌తో ప్రాణహిత నది పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కాగజ్‌నగర్ డీఎస్‌పి బిఎల్‌ఎన్ స్వామి, పెంచికల్‌పేట ఎఫ్ ఆర్‌ఓ వేణుగోపాల్‌తో పాటు పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారు.
*చిత్రం...సంఘటనా స్థలాన్ని పరిశీస్తున్న పోలీసు, అటవీ అధికారులు