క్రైమ్/లీగల్

పుట్టినరోజే ప్రియురాలిపై ప్రేమికుడి హత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 28: మానవీయ విలువలు రోజురోజుకు మంట కలుస్తున్నాయి. పుట్టిన రోజు సరదాగా బయటకు వెళ్లిన 19 ఏళ్ల యువతి పాలిట ఆమె ప్రేమికుడే యముడిగా మారాడు. ప్రేమించిన యువతిని నమ్మించి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనను పోలీసులు సవాల్‌గా తీసుకొని కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. నిందితుడు పులిపాయి సాయిగౌడ్ అలియాస్ సాయికుమార్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నెమలిగొండ గ్రామానికి చెందినవాడు. సాయికుమార్ హంటర్‌రోడ్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుండగా మృతురాలు మానస (19) హంటర్‌రోడ్డులోని నీలమ జంక్షన్ వద్ద దిన్‌దయాల్ నగర్ కాలనీకి చెందిన తన తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నిందితుడు కాలేజీకి వచ్చిపోయే క్రమంలో ఆరు నెలల క్రితం మానసకు, సాయకుమార్‌కు మధ్య పరిచయం కావడంతో వారి మధ్య మాటలు కలవడంతో పాటు ఇరువురూ సెల్‌ఫోన్‌లో కొద్ది రోజులుగా ముచ్చటించుకున్నారు. ఇలా గత కొద్ది రోజుల గడిచిన తరువాత బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో సాయకుమార్ ఆమెకు ఫోన్ చేసి తనను కలిసేందుకు రమ్మని కోరాడు. దీంతో మానస తాను భద్రకాళి గుడికి వెళ్ళి వస్తానని తల్లికి చెప్పి మధ్యాహ్నం బయలుదేరి వెళ్లింది. సాయకుమార్ సూచన మేరకు మానస ముందుగా కోర్టు జంక్షన్ వద్ద వేచిచూస్తోంది. అయతే సాయకుమార్ ఆమెను కాజీపేట వైపు రమ్మని ఫోన్‌లో తెలపడంతో కాజీపేటకు వెళ్లి అక్కడ వేచిచూస్తున్న సమయంలో అతడు కారులో వచ్చి ఎక్కించుకొనిచిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి కారును నిలిపాడు. తర్వాత ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేశాడు. హత్యానేరం తనపై రాకుండా ఉండేందుకు మానస మృతదేహాన్ని తరలించేందుకు నిందితుడు తన మిత్రులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న నిందితుడి మిత్రులు శ్రీకాంత్, శ్రీశాంత్ ఇరువురూ సంఘటనా స్థలానికి చేరుకొని మానస మృతదేహాన్ని చూసిన మిత్రులు ఇద్దరూ భయపడి సహయం చేసేందుకు అంగీకరించగపోగా సంఘటనా స్థలం నుండి తిరిగి వెళ్లిపోయారు. దీంతో నిందితుడు ఒంటరిగానే మానస మృతదేహాన్ని కారులో వేసుకొని చీకటిపడే వరకు చిన్న పెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి, కేయూసీ సెంటర్ మీదుగా అశోక్ టాకీస్ జంక్షన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి చేరుకుని కారును నిలిపివేసాడు. మానస హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితుడు కాలేజీ సమీపంలోని ఒక బట్టల షాపులో పంజాబీ డ్రస్సు కొనుగోలు చేసి తిరిగి కారులో బయలుదేరి హంటర్‌రోడ్‌లోని న్యూశాయంపేటలోని రైల్వేట్రాక్ వద్ద రక్తసిక్తమైన మృతురాలి శరీరం నుండి బట్టలు తొలగించి తాను కొనుగోలు చేసిన బట్టలను మానస మృతదేహానికి అలంకరించాడు. తర్వాత హంటర్‌రోడ్‌లోని విష్ణుప్రియ గార్డెన్స్ పరిసరాల ప్రాంతానికి కారులో చేరుకొని ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడవేసి అనంతరం నిందితుడు తన కారుతో తాను నివాసం ఉంటున్న నెమిలిగొండ్ల గ్రామానికి చేరుకున్నారు. మానస అన్నయ్య శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై సుబేదారి పోలీసులు దర్యాప్తు నిర్వహించి సాయిగౌడ్ హత్య చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన సుబేదారి పోలీసులు నెమిలిగొండ్లలో నివాసం ఉంటున్న నిందితుడితో పాటు నిందితుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ ఇన్‌చార్జి డీసీపీ కేఆర్.నాగరాజు, హన్మకొండ ఏసీపీలు జితేందర్‌రెడ్డి, సాంరగపాణి, సుబేదారి ఇన్‌స్పెక్టర్ అజయ్, టాస్క్ఫోర్స్, ఘనపూర్ ఇన్‌స్పెక్టర్లు నందిరాంనాయక్, రాజీరెడ్డి, సుబేదారి ఎస్సైలు మహేందర్, రవి, కానిస్టేబుళ్లు అనిల్ రాము, వెంకన్న, రమేష్; లింగమూర్తిలను పోలీస్ కమిషనర్ అభినందించారు.
*చిత్రాలు.. హత్యకు గురైన మానస మృతదేహం,
* నిందితుడు సాయిగౌడ్ (ఫైల్ ఫొటో)