క్రైమ్/లీగల్

స్థల వివాదమే పాస్టర్ హత్యకు కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, నవంబర్ 28: హైటెక్ సిటీలో తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్ సత్యనారాయణ రెడ్డి హత్య కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. హత్యకు మతపరమైన కారణలు లేవని, 300 గజాల స్థలం వివాదంలో కాపుకాసి హతమార్చారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావుతెలిపారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముండే ఆర్ని సత్యానారాయణ రెడ్డి అక్కడ సమీపంలో రేహోబోతు ప్రేయర్ హౌస్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. సత్యనారాయణ రెడ్డికి మియాపూర్‌లోని హఫీజ్‌పేట్‌లో 300 గజాల స్థలం ఉంది. స్థలాన్ని బేరం పెట్టగా హఫీజ్‌పేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జమీల్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చి రూ.80 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. 45 రోజులు సమయం తీసుకున్న జమీల్ రూ.3లక్షలు అడ్వన్స్‌గా చెల్లించాడు. అనుకున్న ప్రకారం 45 రోజులు గడచిపోయినప్పటికీ జమీల్ డబ్బు ఇవ్వకపోవడంతో సత్యనారాయణ రెడ్డి మరొకరికి రూ.10లక్షలు ఎక్కువ చేసి ప్లాటును విక్రయించారు. రూ.పది లక్షలు ఎక్కవ వచ్చినందున తను ఆడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.3లక్షలు తిరిగి ఇవ్వాలని జమీల్ వత్తిడి తెచ్చాడు. సత్యనారాయణ రెడ్డి డబ్బు ఇవ్వలేదు. దీంతో రెడ్డికి సంబంధించిన స్థలం జమీల్ తనదని బోర్డు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ట్రెస్‌పాస్ కేసు నమోదు చేసి జమీల్‌ను మియాపూర్ పోలీసులు జైలుకు పంపించారు. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా తనపై కేసులు పెడుతున్నాడని ఆగ్రహించి సత్యనారాయణ రెడ్డి హత్యకు జమీల్ పథకం వేశాడు. హఫీజ్‌పేటకు చెందిన షేక్ షబీర్(44), మహమ్మద్ అజాహర్ (27) మహ్మమద్ ఇస్మాయిల్ (23), మేతరి రవి (19)తో కలసి సత్యనారాయణ రెడ్డి హత్యకు పథకం వేశారు. సత్యనారాయణ స్థలంలో ఉన్న రూము కిరాయికి కావాలని మేతరి రవితో ఫోన్ చేయించి అనంతపురం నుంచి పిలిపించాడు. గత శుక్రవారం రాత్రి నగరానికి వచ్చిన సత్యనారాయణ రెడ్డిని కాపుకాసి కొండపూర్ జేవీజీ హిల్స్ వద్ద కత్తులతో పొడిచి హత్య చేశారు. నిందితులు ఉపయోగించిన మూడు కత్తులను రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితలను అరెస్టు చేసిన గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ రావుని, డీఐ కాస్ట్రో రెడ్డి, ఎస్‌ఓటీ సీఐ రమేష్‌ని డీసీపీ అభినందించారు. విలేఖరుల సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.