క్రైమ్/లీగల్

పాత నేరస్థుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 28: చెడు వ్యసనాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థున్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.
చంద్రాయణగుట్ట, బార్కాస్‌కు చెందిన ఫరీద్ ఖాన్ వృతిరీత్యా మెకానిక్. గంజాయితో పాటు ఇతర చెడు వ్యవసనాలకు బానిస అయ్యాడు. వాటిని తీర్చుకునేందుకు సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను అనే్వషించి చోరీలను ఎంచుకున్నాడు. రాత్రులు రోడ్లు, కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి చోరీ చేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాగా గడుపుతున్నాడు. ఇటీవల ఇమ్రాన్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోనికి తీసుకొని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యత్నించాడు. అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా చోరీల చిట్టా విప్పాడు. అతని వద్ద నుంచి రూ.4.23లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 22 సెల్‌ఫోన్లు, ట్యాబ్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.