క్రైమ్/లీగల్

ఉద్యోగినంటూ మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 28: రాష్ట్ర సచివాలయ ఉద్యోగినని చెప్పి పలువురిని మోసగించిన ఘరానా మోసగాడిని, అతనికి సహకరించిన మరో మహిళను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను పశ్చిమ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సురేష్ కుమార్ చారి ఇంటర్నేట్‌లో ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల జాబితాను తీసుకొని ఫోన్ నెంబర్లను సైతం సేకరిస్తాడు.
వారికి ఫోన్ చేసి తనకు తానుగా సెక్రటరియేట్‌లో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా పరిచయం చేసుకుంటాడు. ఏసీబీలో దొరికిపోయిన మీకు పోస్టింగ్‌లు ఇప్పిస్తామని చెప్పి అందినకాడికి దోచుకుంటాడు.
వీటితో పాటు తాను కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ అని చెప్పి జీఓ 58 ప్రకారం ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తానని చెప్పి అమాయకుల నుంచి సుమారు రూ.20లక్షలు దోచుకున్నాడు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి పోలీసులు దిగి సురేష్ చారిని అదుపులోనికి తీసుకొని విచారించగా తాను చేసిన మోసాల చిట్టా విప్పాడు. ఇతనికి సహరించిన అనురాధ అనే మహిళను అరెస్టు చేయడంతో పాటు వీరి వద్ద నుంచి రూ.25వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు.