క్రైమ్/లీగల్

కాటన్ ప్రెస్సింగ్ మిల్లులో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాలటౌన్, నవంబర్ 27: గద్వాల జిల్లా కేంద్రంలోని కొండపల్లి గ్రామ శివారులో ఉన్న జయలక్ష్మీ కాటన్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్‌తో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జయలక్ష్మీ పత్తిమిల్లు యాజమాన్యం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం జయలక్ష్మీ పత్తిమిల్లులో ప్రాసెసింగ్ పూర్తి అయిన కాటన్‌బేళ్లకు ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మిల్లులో భారీస్థాయిలో నిల్వ ఉంచిన పత్తిబేళ్లు అగ్నికి ఆహుతి అవుతుండగా మంటలు ఆర్పేందుకు మిల్లు యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకునే లోపే 5వేలకు పైగా పత్తిబేళ్లు అగ్నికి ఆహుతయ్యాయ. అగ్నిమాపక సిబ్బంది కాటన్ మిల్లుకు చేరుకుని మంటలను ఆర్పి మిగిలిన పత్తిబేళ్లపై నీటిని చల్లి ప్రమాదాన్ని నివారించేందుకు కృషి చేశారు. ప్రమాదంలో నష్టం రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

*చిత్రం... మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది