క్రైమ్/లీగల్

హీరో సంపూర్ణేష్‌బాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 27 : సినీ హిరో సంపూర్ణేష్‌బాబు కుటుంబ సమేతంగా కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో కారు వెనుకభాగం దెబ్బతిన్న సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సంపూర్ణేష్‌బాబు, కుటుంబ సభ్యులు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం వివరాల ఉన్నాయి. సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు తన భార్య, పిల్లలతో కలసి తన కారులో శ్రీనగర్ కాలనీ నుండి పాత బస్టాండ్ వైపు వెళ్తున్నారు. కొత్త బస్టాండ్ వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుండి సిద్దిపేట పాత బస్టాండ్ వైపు వస్తూ సంపూర్ణేష్‌బాబు కారును వెనుకవైపు నుండి ఢీకొట్టింది. కారు వెనుకభాగం దెబ్బతింది. సంపూర్ణేష్‌బాబు కూతురు గాయత్రి వెనుకసీటు నుండి ముందు సీట్లలోకి ఎగిరి పడింది. సంపూర్ణేష్‌బాబు, భార్య ఉమారాణి, కూతుళ్లు గాయత్రి, భవ్యశ్రీలకు ఎలాంటి గాయాలు తగలలేదు. ప్రమాదంపై సంపూర్ణేష్‌బాబు సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సును నడుపుతున్న తాత్కలిక డ్రైవర్ సంపత్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
*చిత్రాలు.. సంఘటనా స్థలం వద్ద సంపూర్ణేష్‌బాబు
* తాత్కాలిక డ్రైవర్ సంపత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు