క్రైమ్/లీగల్

‘బిల్లా-రంగా’లా చూస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తనను హంతుకులైన ‘బిల్లా-రంగా’లా చూస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ. చిదంబరం సుప్రీం కోర్టులో చెప్పారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో 99 రోజులుగా కస్టడీలో ఉన్న తనను కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసుల్లో ముద్దాయిలైన రంగా, బిల్లా తరహాలో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1978లో అక్కా తమ్ముడు గీతా చోప్రా, సంజయ్ చోప్రాలను రంగా, బిల్లా కిడ్నాప్ చేశారు. గీతపై అత్యాచారం జరిపారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ్ముడు సంజయ్‌ని కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత నిజం బయట పడుతుందన్న భయంతో గీతను కూడా హతమార్చారు. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆ సంఘటన తర్వాత ఇలాంటి ఘోరాలకు పాల్పడే వారిని బిల్లా, రంగాతో పోల్చడం ఆనవాయితీగా మారింది. తనను కూడా అదే రీతిలో పరిగణిస్తున్నారని చిదంబరం వాపోయారు. ఐఎన్‌ఎక్స్ మీడియా, మనీ ల్యాండరింగ్ కేసులో తనపై ఒక్క నేరం కూడా రుజువు కాలేదని ఆయన గుర్తు చేశారు. బెయిల్ ఇవ్వగల సాధారణ కేసులున్నా బెయిల్ మంజూరు చేయడం లేదని ఆయన అన్నారు. ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్‌గానీ, సీబీఐ గానీ ఒక్క సాక్ష్యాన్ని కూడా కోర్టు ముందు ఉంచలేకపోయిందన్నారు. 99 రోజులుగా కస్టడీలో ఉన్న చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. అత్యంత సాధారణమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి బెయిల్ ఇవ్వకపోవడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును కోరారు.