క్రైమ్/లీగల్

పేలిన కెమికల్ డబ్బా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 27: పాత ఇనుప డబ్బాను పగులగొట్టే (కట్ చేసే క్రమంలో) ఆ డబ్బాలో గుర్తుతెలియని కెమికల్ ఉండడంతో ఒక్కసారిగా పేలుడు జరిగి ఓ వ్యక్తి చేతులు చెల్లా చెదురైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాజులరామారం డివిజన్ అంబేద్కర్ నగర్‌లో నివాసముండే ఖయ్యూమ్ (38)కి భార్య, ముగ్గురు పిల్లలు సంతానం. ఇళ్లలోని పాత ఇనుప సామాగ్రిని కొనుగోలు చేసుకుని స్క్రాప్ గోదాములో విక్రయించుకుని జీవిస్తుంటాడు. గాజులరామారం డివిజన్ దేవేందర్ నగర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయం వెనుక ఖయ్యూమ్‌కు ఓ మహిళ ఇచ్చిన డబ్బాను పగులగొట్టె కట్‌చేసే ప్రయత్నం చేశాడు. డబ్బాలో గుర్తుతెలియని కెమికల్ ఉండడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఖయ్యూమ్ రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చేతి వేళ్లు కట్‌అయి ఎగిరిపోయాయి. పేలుడు సంభవించిన సంఘటన ప్రాంతంలో మరో మహిళ మునీరుషకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఖయ్యూమ్‌ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖయ్యూమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.