క్రైమ్/లీగల్

కార్మికులకు జీతం బాకీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చట్టప్రకారం చూస్తే ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి బాకీ లేదని ఆర్టీసీ యాజమాన్యం బుధవారం నాడు హైకోర్టులో వాదనలు వినిపించింది. కార్మికుల వేతనాలకు సంబంధించి ఆర్టీసీ జాక్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. యాజమాన్యం, మరోపక్క జాక్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. చట్ట ప్రకారం కార్మికులు ఒకరోజు గైర్హాజరైతే 8 రోజుల వేతనాన్ని కోత విధించవచ్చని, ఆ విధంగా చూస్తే కార్మికుల సెప్టెంబర్ నెల జీతం
మొత్తం విధులకు గైర్హాజరైన రోజులకు సరిపోదని, కార్మికులే తిరిగి తమ సంస్థకు బాకీ ఉంటారని యాజమాన్యం పేర్కొంది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు కిందకు ఆర్టీసీ రాదని, ఈ చట్టం కిందకు పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మాత్రమే వస్తాయని ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఆర్టీసీ ఈ చట్ట పరిధిలోకి రాదని జాక్ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం ఇది నిర్బంధ పని, వెట్టిచాకిరీ కిందకు వస్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ తీరుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. జీతాలకు సంబంధించి కార్మికులు కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని హైకోర్టు పేర్కొనగా, దీనిపై ధర్మాసనంలో అప్పీలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని జాక్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. కాగా, తదుపరి విచారణను హైకోర్టు వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
సవరణ పిటిషన్ దాఖలు
ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో బుధవారం నాడు సవరణ పిటిషన్‌ను ప్రొఫెసర్ పీ ఎల్ విశే్వశ్వరరావు దాఖలు చేశారు. మంగళవారం నాడు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ అనేక అంశాలను లేవనెత్తారు. అవేవీ పిటిషన్‌లో ప్రస్తావించలేదని పేర్కొంటూ న్యాయస్థానం సవరణ పిటిషన్‌ను దాఖలు చేయాలని కోరింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరుతామని అంటున్నా యాజమాన్యం వారికి అవకాశం ఇవ్వడం లేదని పిటిషనర్ వాదించారు. జీతాలు లేక, కుటుంబాలను పోషించలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను గురువారం నాడు కొనసాగించనున్నట్టు పేర్కొంది.