క్రైమ్/లీగల్

అత్యాచార యత్నం కేసులో ఆటోడ్రైవర్‌కు పదేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 26: మహిళపై అత్యాచారానికి యత్నించిన కేసులో నిందితునిపై నేరం రుజువుకావడంతో పది సంవత్సరాలు జైలుశిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం.. కంకిపాడు మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన మహిళ 2014 ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో కంకిపాడు సెంటర్ నుంచి బొడ్డపాడు గ్రామానికి వెళ్ళేందుకు ఆటో ఎక్కింది. మార్గంలో ఆటో కంకిపాడు బచ్చుపేట దాటి బొడ్డపాడు వచ్చేసరికి ఆటో నిలిపిన డ్రైవర్ సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో బాదితురాలు కేకలు పెట్టడంతో ఆటోడ్రైవర్ పరారయ్యాడు. ఘటనపై అప్పటి కంకిపాడు ఎస్‌ఐ గుణరాము కేసు నమోదు చేసి నిందితుడు గొడవర్రు గ్రామానికి చెందిన ఉప్పులేటి ఆనంద్‌కుమార్ అలియాస్ ఆనంద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన 12మంది సాక్షులను విచారించిన మీదట నిందితునిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మహిళకు తీవ్ర గాయాలు
అవనిగడ్డ, నవంబర్ 26: మండల పరిధిలోని పులిగడ్డ వద్ద విజయవాడ నుండి అవనిగడ్డ వస్తున్న ఆర్టీసీ కరకట్ట బస్సు ఆటోను ఢీకొనటంతో మేడా యేసమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళ కడుపులో నుంచి వెనుక వైపునకు వచ్చిన అల్యూమినియం రాడ్ వల్ల తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం ఉన్నత చికిత్సకు బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యేసమ్మ గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ మేరకు అవనిగడ్డ ఎస్‌ఐ సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.