క్రైమ్/లీగల్

ఉరేసుకుని యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, నవంబరు 26: మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఒక యువకుడు మానసిక వైద్య కేంద్రంలో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటన నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. నున్న సీఐ ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కడప ప్రాంతానికి చెందిన రజనీకాంతరెడ్డి కుమారుడు సుజిత్‌రెడ్డి(18) కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. నగరంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా కొన్ని నెలల పాటు వైద్యం చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఇందుకు తండ్రి అంగీకరించడంతో నున్నలో ఒక ఆసుపత్రికి చెందిన శాంతివనానికి తరలించారు. నెల రోజులుగా చికిత్స పొందుతున్న సుజిత్‌రెడ్డి మంగళవారం ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.