క్రైమ్/లీగల్

మామూలు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నికల ఖర్చుపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోమని ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్ట చేసింది. జేపీ దివాకర్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలపై అనంతపురం లోక్‌సభ సీపీఐ అభ్యర్థి దేవరగుడి జగదీశ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్ ధర్మాసనం విచారించింది. దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ధర్మాసనాన్ని కోరారు. ఎన్నికల్లో డబ్బు ఆశ చూపుతున్నారని ప్రజలు ఫిర్యాదు చేయకుండా చర్యలు తీసుకోలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మాములుగా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించలేమని వెల్లడించింది. అలాగే ఆధారాలు సమర్పించి వుంటే చర్యలకు ఆదేశించవచ్చునని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికలల్లో డబ్బు ప్రభావం పెరుగుతుందన్న మాటా వాస్తమేనని, దీనిపై ప్రజలు ముందుకు రావాలని వ్యాఖ్యనించారు. పిటిషన్ ఉపసంహరించుకోవాలని ధర్మాసనం పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తామని.. కారణాలతో కూడిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అనంతరం పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.