క్రైమ్/లీగల్

వరంగల్‌లో అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 21: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు గంజాయి స్మగ్లర్లను గురువారం వరంగల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 50 లక్షల రూపాయల విలువగల అరటన్ను(500కిలోల) గంజాయితో పాటు రెండు నాటు తుపాకులు, 11 రౌండ్లు, ఒక కత్తి, ఒక బొలేరో వాహనం ఐదు సెల్‌ఫోన్లు, ఒక కారు, లక్షా 50 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గీసుగొండ పోలీసులు అరెస్టు చేసిన వారిలో వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన దండెబోయిన సుమన్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం గ్రామానికి చెందిన వంతల విజయ్, గిమ్మెల రంగారావు, వంతల నర్సింగరావు, మరొక బాల నేరస్ధుడు ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వివరాలు వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితులైన దండెబోయిన సుమన్ గతంలో వరంగల్ నగరంలో హోటల్ వ్యాపారాన్ని నిర్వహించేవాడు. ఈ వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు అప్పులు కూడా అధికం కావడంతో సులభంగా డబ్బు సాంపాదించాలనే ఆలోచనతో విశాఖపట్నం జిల్లాలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి వాటిని తిరిగి ఇతర రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో అమ్మేందుకుగాను నిందితుడైన దండెబోయిన సుమన్ ప్రణాళికను రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగానే నిందితుడు గతంలో తన దగ్గరి బంధువుతో కలిసి విశాఖపట్నం నుండి గంజాయి తరలించే వాహనానికి డ్రైవర్‌గా పనిచేసాడు. అయతే ఇదే సమయంలో నిందితుడుని విశాఖపట్నం జిల్లాకు చెందిన నాతవరం, నర్సీంపట్నం టౌన్, నర్సీపట్నం గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇదే అనుభవంతో నిందితుడు సులభంగా డబ్బు సంపాందించాలనే ఆలోచనతో మరోమారు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా, అన్నవరం చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన నలుగురు పాతస్మగ్లర్లతో పరిచయం చేసుకొని తమకు కావాల్సిన గంజాయిని వరంగల్‌కు చేరవేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నలుగురు నిందితులు ముందుగా గంజాయి పోట్లాలను రహస్యంగా తరలించే విధంగా బొలేరో వాహనాన్ని ఆధునీకరించి రాత్రి సమయంలో అన్నవరం నుండి రాజమండ్రి, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం మీదుగా ప్రయాణించి గీసుగొండ మండలం, గొర్రెకుంట గ్రామం కీర్తినగర్ కాలనీలో నివాసం ఉంటున్న నిందితుడైన సుమన్‌కు అందజేసేవారు.