క్రైమ్/లీగల్

*వీఐపీ ఏరియాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 19: వీఐపీలు నివసించే ప్రాంతాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను పశ్చిమ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు వెల్లడించారు. కార్మికనగర్‌కు చెందిన మహ్మద్ మన్సూర్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరుధుల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వాటిలో చొరబడి భారీ మొత్తంలో దోచుకుంటున్నాడు. ఇదే తరహాలో ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని నివాసం ఉండే రఘురామి రెడ్డి ఇంట్లోకి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగదును దొంగిలించాడు. ఈ విషయమై రాఘురామి రెడ్డి భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మన్సూర్‌ను గుర్తించి, గాలింపు చేపట్టారు. మంగళవారం రోడ్డుపై అనుమానస్పదంగా తిరుగుతున్న మన్సూర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పొంతనలేని సమాదానాలు చెబుతూ పారిపోయేందుకు యత్నించాడు. స్టేషన్‌కు తరలించి పూర్తిస్థాయిలో విచారించగా చేసిన చోరీల చిట్టా విప్పాడు. దీంతో అతని వద్ద నుంచి రూ.11లక్షల 60వేలు విలువ చేసే ఆభరణాలతో పాటు రూ.14500 నగదును స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు. సమావేశంలో సీఐ బలవంతయ్య, డీఐ రమేష్ పాల్గొన్నారు.