క్రైమ్/లీగల్

ఆర్టీసీ కార్మికులను.. విధుల్లోకి తీసుకునే విచక్షణ ప్రభుత్వానిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రతి మంగళవారం నాడు అందుబాటులోకి వచ్చింది. కార్మికులను విధుల్లోకి తీసుకునే విచక్షణను ప్రభుత్వానికీ , ఆర్టీసీకి వదిలిపెడుతున్నామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్టీసీ, ప్రభుత్వం ఆదర్శ ఉద్యోగ సంస్థగా వ్యవహరిస్తాయని తాము ఆశిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. సమ్మె ఉద్ధేశ్యం డిమాండ్ల పరిష్కారానికే కానీ విధులను విడిచిపెట్టడం కాదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తుచేశారు. సమ్మె చేసినంత మాత్రాన కార్మికులు విధులను విడిచిపెట్టినట్టు కాదని ప్రభుత్వం, ఆర్టీసీ గుర్తించాలని పేర్కొన్నారు. పోరాటం కేవలం కార్మికులకూ యాజమాన్యానికీ మధ్య మాత్రమే కాదని, ప్రభుత్వం , ఆర్టీసీ గ్రహించాలని అన్నారు. కార్మికులను బయటకు పంపితే వారి కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతాయని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని, కేవలం 48 వేల మంది కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం అనేది ఇక్కడ ప్రశ్న కానేదకాదని, సుమారు 48వేల మంది కుటుంబాలకు చెందిన లక్షల మందికి సంబంధించిన అంశంగా ప్రభుత్వం గ్రహించాలని పేర్కొన్నారు. ఒక వేళ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే వారికి మరో ఉద్యోగం రాదని ఇప్పట్లో దొరకడం కష్టమని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో ఉన్న నిరుద్యోగికత , వయోపరిమితి కారణంగా వారికి మళ్లీ ఉద్యోగాలు దొరకడం అంత సులువు కాదని పేర్కొంది. తప్పు చేసిన ఉద్యోగులపై కూడా యాజమాన్యం ఔదార్యాన్ని పాటించాలని , ఉద్యోగుల కుటుంబ సభ్యులపై కూడా యాజమాన్యం దయ, కరుణ చూపాలని హైకోర్టు పేర్కొంది. కార్మికుల సమస్యలను వీలైనంత త్వరగా ప్రభుత్వం, ఆర్టీసీ పరిష్కరిస్తాయని తాము ఆశిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. వివాదం పరిష్కారమయ్యేవరకూ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారని, ప్రజల అవసరాలకు అనుగుణంగా తగినన్ని బస్సులను సమకూర్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ ఏ అభిషేక్‌రెడ్డి కూడా ఉన్నారు.
ఆత్మహత్యలపై కౌంటర్
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కొనసాగుతున్న వ్యాజ్యంలో సీఎస్ కౌంటర్‌ను దాఖలు చేశారు. తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశే్వశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై సీఎస్ కౌంటర్ దాఖలు చేశారు. వ్యాజ్యంలో నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేశారని సీఎస్ పేర్కోన్నారు. చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ కమిషనర్‌కు ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందని సీఎస్ పేర్కొన్నారు.కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మిక శాఖ కమిషనర్ తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.