క్రైమ్/లీగల్

జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేయించాలని, ఈ దిశగా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ నాయకుడు, సీనియర్ లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇంతకు ముందు ఒక ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్)పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరికి మించి పిల్లలు ఉండరాదన్న చట్టాన్ని తేవాలన్నారు. చట్టం అనేది ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అంశమని, తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు ఇంతకు ముందే స్పష్టం చేసింది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉండరాదన్న చట్టాన్ని రాష్ట్రాలు లేదా కేంద్రం తీసుకురావాలని, అది కోర్టు పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. అయితే, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ తీర్పుపై ఉపాధ్యాయ అసంతృప్తి వ్యక్తం చేశారు. జనాభా విపరీతంగా పెరిగిపోతున్నదని, దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు పెరిగిన జనాభానే ప్రధాన కారణమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్యంతోపాటు అనేకానేక హక్కులు ప్రజలకు ఉన్నాయని పేర్కొన్నారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణలో జనాభా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలు, కేంద్రానికి ఉందని తెలిపారు. కానీ, ఈ దిశగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. భారత జనాభా చైనాను మించిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో ఉంటున్న జనాభాలో 20 శాతం మందికి ఆధార్ కార్డులు లేవని, కాబట్టి, గణాంకాలు చెప్తున్న సంఖ్య కంటే అధికంగానే ఉంటుందని అన్నారు. అంతేగాక, రోహిన్యాలు, బంగ్లాదేశీయులు లెక్కకు మించి మన దేశంలోకి చొరబడుతున్నారని, వారిని కూడా లెక్కిస్తే, దేశ జనాభా చైనాను మించిపోతుందని అన్నారు. ఈ కారణంగానే వౌలిక సదుపాయాలు కూడా ప్రజలకు సక్రమంగా అందడం లేదని, జీవించే హక్కు కూడా చేజారుతున్నదని వ్యాఖ్యానించారు. కాబట్టి, జనాభా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.