క్రైమ్/లీగల్

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, నవంబర్ 17: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. మండలపరిధిలోని ఇనుపాముల గ్రామశివారు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి ఒక్క సారిగా బ్రేకులు వేయడంతో వెనుకనుండి వస్తున్న రెండు కార్లు వెనుక నుండి లారీని ఢీకొట్టాయి. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం 108 ద్వారా నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వారిలో సుదరి పద్మ, స్వప్న, దయాకర్, స్వర్ణ, సంధ్య ఉన్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించింది. తర్వాత పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

*చిత్రం... లారీని ఢీకొన్న కారు