క్రైమ్/లీగల్

కాటేసిన కాలపాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 14: కలుషిత నీరు తాగి అక్కాచెల్లెళ్లు మృతిచెందిన సంఘటన హృదయ విషాదకరమైన ఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం చింతల్‌మెట్ ఎం ఎం పహాడీ బస్తీకి చెందిన మహ్మద్ ముస్తాన్ అలీ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు మెన్హాజ్‌బేగం(11), నైనా(9) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కొన్ని రోజులుగా చింతల్‌మెట్ ఎంఎం పహాడీ బస్తీలలో డ్రైనేజీ మురుగునీరు మంచినీటి పైపులైన్‌లో కలుస్తున్నాయి. దీనికి తోడు పారిశుద్ధ్య లోపం కలుషిత ఆహారం తినడంతో అక్కాచెల్లెళ్లు రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే తల్లిదండ్రులు వారికి స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హఫీజ్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వైద్యం అందించిన డాక్టర్లు మేన్హాజ్‌బేగాన్ని ఆరోగ్య పరిస్థితి బాగాలేదని నైనాను నీలోఫర్‌కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో నైనాను నీలోఫర్ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. చికిత్స పొందుతున్న అక్క హఫీజ్‌బేగం కూడా మృతిచెందింది.
ఇద్దరూ ఒకే సారి అస్వస్థతకు గురి కావడం, ఒకే రోజు మృతి చెందడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. చిన్నారుల కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆసుపత్రులకు వెళ్లి చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.