క్రైమ్/లీగల్

ఎలా ప్రైవేటీకరిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం హైకోర్టులో విచారణ కొనసాగింది. సుదీర్ఘవాదనల అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు, రూట్ల ప్రైవేటీకరణపై స్టే తదుపరి ఆదేశాల వరకూ కొనసాగుతుందని ప్రకటించిం ది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశే్వశ్వరరావు దాఖలు చేసిన ప్రజావాజ్యపిటిషన్ (పిల్)పై విచారణ కొనసాగించిన హైకోర్టు ఇందులో కేంద్రం ప్రస్తావన ఎందుకు
తీసుకురాలేదని ప్రశ్నించింది. కేంద్రాన్ని కూడా పార్టీగా చేర్చాలని, సవరించిన పిటిషన్‌ను సోమవారం కోర్టు ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. మరోపక్క రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానాన్ని సీల్డు కవర్‌లో అడ్వకేట్ జనరల్ కోర్టుముందుంచారు. రెండు కాపీలను సమర్పించగా, పిటిషనర్ తనకు కూడా ఒక కాపీ ఇవ్వాలని కోరారు. మంత్రివర్గ తీర్మానంలో ఏం ఉందో తెలియకుండా తాము ఎలా వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొనగా, కాపీలో గోప్యత ఏం ఉందని కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ రూట్లకు సంబంధించిన మంత్రిమండలి నిర్ణయాన్ని ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొందని, అలాంటి నిర్ణయాలను ప్రజలకు ఎందుకు తెలియజేయలేదని ధర్మాసనం నిలదీసింది. దీనిపై ఏజీ స్పందిస్తూ, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు నేరుగా ప్రజలకు అందుబాటులో ఉంచలేమని, మంత్రి మండలి నిర్ణయాలు జీవో రూపంలో వచ్చిన తర్వాతనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇంత వరకూ మంత్రివర్గ తీర్మానం మాత్రమే జరిగిందని, దానిని గెజిట్‌లో ప్రచురించి, జీవోగా జారీ చేసిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని ఏజీ వివరించారు. కాగా, రూట్ల ప్రైవేటీకరణ, ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే పదజాలంపై కూడా కొద్దిసేపు చర్చ జరిగింది. మంత్రిమండలి తీర్మానాన్ని అధ్యయనం చేసిన ధర్మాసనం దీనిపై వాదనలు ప్రారంభించగా, ఏజీ ఇన్‌కెమరా విచారణ జరపాలని కోరారు. దానిని ఆమోదించిన ధర్మాసనం కొద్ది సేపు ఆ తరహాలోనే విచారణ కొనసాగించింది. రూట్ల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేర్చి వారి వాదనలు కూడా సోమవారం నాడు వినిపించాలని ఆదేశించింది. అంత వరకూ రూట్ల ప్రైవేటీకరణపై స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. మోటార్ వాహనాల చట్టం 102 ప్రకారం ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంశాన్ని బహిరంగపరిచిందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. నోటీసులో పెట్టకుండానే మంత్రిమండలి ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించింది. అయితే పిటిషన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సవరించాలని ధర్మాసనం చేసిన సూచనకు సంబంధిత న్యాయవాది అంగీకరించారు.