క్రైమ్/లీగల్

ఎమ్మెల్యేల అనర్హత వేటును సమర్థించిన సుప్రీం కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: కర్నాటకలో 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే వారు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసింది. కాంగ్రెస్-జేడీ(ఎస్)కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2023 సంవత్సరం వరకు అనర్హత ఎమ్మెల్యేలు పోటీ చేయరాదని స్పీకర్ ఆదేశించారు. ఇలాఉండగా సుప్రీం కోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారీ ఈ కేసుపై విచారణ ముగించి బుధవారం తీర్పునిచ్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం స్పీకర్‌కు సంక్రమించిన అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తులు చెప్పారు. అయితే 2023 సంవత్సరం వరకు ఎమ్మెల్యేలు పోటీ చేయరాదన్న ఆదేశాన్ని వారు తోసిపుచ్చారు. ఈ విషయంలో స్పీకర్‌కు ఆ అధికారం లేదని పేర్కొన్నారు. తాము కేసు పూర్వాపరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ తీర్పును వెలువరిస్తున్నామని తెలిపారు. ధర్మాసనం తీర్పుతో అనర్హత పడిన ఎమ్మెల్యేలకు వచ్చే నెల 5న 15 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. అంతేకాకుండా వారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీం కోర్టుకు రావడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.