క్రైమ్/లీగల్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పు నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: శబరిమల దేవాలయంలోకి అన్ని వయస్సులు గల మహిళలను అనుమతించడంపై దాఖలైన 65 పిటీషన్లపై సుప్రీం కోర్టు గురువారం (14న) తీర్పు ఇవ్వనున్నది. మొత్తం 65 పిటీషన్లలో 56 రివ్యూ పిటీషన్లు, మరో నాలుగు తాజా రిట్ పిటీషన్లు, ఐదు బదిలీ విన్నపాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శబరిమల ఈ 65 పిటీషన్లపై విచారణ ముగించింది. ఈధర్మాసనంలో జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఎఎం ఖన్వీల్కర్, జస్టిస్ రోహింటన్ నారీమన్ కూడా ఉన్నారు. విచారణ పూర్తి చేసిన ధర్మాసనం ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆ తీర్పు గురువారం వెలువడే అవకాశం ఉంది. అన్ని వయస్సుల గల మహిళలను శబరిమల దేవాలయంలోకి అనుమతిస్తూ సుప్రీం కోర్టు 2018 సంవత్సరం సెప్టెంబర్ 28 తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును పునుఃసమీక్షించాలని కోరుతూ పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. మహిళలను అనుమతించకుండా ఆదేశాలు జారీ చేయాలని, దేవాలయం ఆచారాలు, సంస్కృతిని పరిరక్షించాలని పిటీషనర్లు కోరారు. అసలేం జరిగింది అంటే: పవిత్రమైన శబరిమల ఆలయంలోకి పదేళ్ళలోపు బాలికలను, 50 ఏళ్ళు దాటిన వృద్ధ మహిళలను అనాదిగా అనుమతిస్తున్నారు. అయితే అన్ని వయస్సుల మహిళలనూ అనుమతించాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు గత ఏడాది విచారణ చేపట్టింది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్ 28న అన్ని వయస్సుల మహిళలనూ అనుమతించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రముఖ అయ్యప్ప స్వామి దేవాలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించడం ప్రారంభించారు. అయితే పవిత్రమైన ఆలయంలోకి అనాదిగా అన్ని వయస్సుల మహిళలను అనుమతించడం లేదని, ఇప్పుడు అనుమతిస్తే అపచారం అవుతుందని, ఇది అక్రమం అని, రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఆందోళనలు జరిగాయి. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ పిటీషన్లు దాఖలయ్యాయి. కాగా కేరళ ప్రభుత్వం పునఃసమీక్ష కోరవద్దని భావించింది. ట్రావెన్‌కోర్ దేవాస్‌వాం బోర్డు (టీడీబి) సుప్రీం ఆదేశాలను పాటించి మహిళలను అనుమతించింది. బోర్డు నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ వత్తిడికి లొంగిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తీర్పును పునఃసమీక్షించాలంటూ అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. శాంతి-్భద్రతల సమస్య తలెత్తడంతో ఈ విషయంలో తమ ప్రభుత్వం కంట్రోలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ తరపున సీనియర్ అడ్వకేట్ జయదీప్ కోర్టుకు భరోసా ఇచ్చారు. హిందూ మత ఆచారం ప్రకారం దేవాలయాల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధాలు విధించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలాఉండగా తమ తీర్పును పునఃసమీక్షించాలంటూ పిటీషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు అందకు లోబడి మాత్రమే తమ వాదన వినిపించాలని ధర్మాసనం సూచన చేసింది. పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటీషన్లపై న్యాయవాదులు భిన్నవాదనలు వినిపించారు. హిందూ మత ఆచారాలపై కోర్టులు జోక్యం చేసుకోరాదని, అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కాపాడాలని కోరారు. మరోవైపు కుల, మతాలకు, లింగ వివక్షలకు దూరంగా అందరినీ అనుమతించాలన్న వాదన కూడా వచ్చింది. ఈ రకంగా వచ్చిన భిన్న వాదనలపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయోధ్యలోని భూ వివాదంపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పును ఇచ్చినందున ఇప్పుడు శబరిమల తీర్పు కూడా అలాగే ఉంటుందన్న ఆశతో దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.