క్రైమ్/లీగల్

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ తనపై నమోదయిన ఒక క్రిమినల్ పరువునష్టం కేసులో కోర్టుకు హాజరు కానందుకు ఢిల్లీ కోర్టు ఆయనకు వ్యతిరేకంగా బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘శివలింగంపై తేలు’ అని వ్యాఖ్యానించినందుకు థరూర్‌పై క్రిమినల్ పరువునష్టం కేసు నమోదయింది. ఒక ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ప్రధాని మోదీని ‘శివలింగంపై కూర్చున్న తేలు’తో పోల్చారని థరూర్ గత సంవత్సరం అక్టోబర్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో థరూర్ కాని, ఆయన తరపు న్యాయవాది కాని కోర్టుకు హాజరు కాలేదని పేర్కొంటూ, చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీజేఎం) నవీన్ కుమార్ కాశ్యప్ నవంబర్ 27వ తేదీన న్యాయస్థానం ముందు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ సోమవారం థరూర్‌కు వ్యతిరేకంగా వారెంట్ జారీ చేశారు. థరూర్‌పై ఫిర్యాదు చేసిన ఢిల్లీ బీజేపీ నాయకుడు రాజీవ్ బబ్బర్ కూడా కోర్టు ముందు హాజరు కాకపోవడంతో సీజేఎం అతనికి రూ. 500 జరిమానా విధించారు. అయితే, బబ్బర్ తరపున ఆయన జూనియర్ న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. ‘్ఫర్యాదుదారు కాని ఆయన తరపు ప్రధాన న్యాయవాది కాని కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు హాజరుకు మినహాయింపు కల్పించాలని కోరుతూ ఫిర్యాదుదారు పెట్టుకున్న దరఖాస్తు అందింది. అయితే, అది కూడా అస్పష్టంగా ఉంది. ఫిర్యాదుదారు తాను వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నానని దరఖాస్తులో పేర్కొన్నారు. కాని, ఆ ‘ఇబ్బందులు’ ఏంటి అనే విషయాన్ని దరఖాస్తులో ఎక్కడా తెలియచేయలేదు’ అని కోర్టు పేర్కొంది. ‘ఇప్పటికీ, సౌమ్యమయిన దృక్పథాన్ని అనుసరిస్తూ, ఫిర్యాదుదారు హాజరు కాలేదన్న కారణంతో అతను దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చకుండా, అతను తీస్ హజారి కోర్టులోని సెంట్రల్ డిస్ట్రిక్ట్‌కు చెందిన, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటి (డీఎల్‌ఎస్‌ఏ) వద్ద రూ. 500లు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించడమయినది’ అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో థరూర్ కాని, ఆయన తరపు న్యాయవాది కాని హాజరు కాకపోవడాన్ని ప్రస్తావించింది.
అయితే, తాను సౌమ్యమయిన దృక్పథంతో వ్యవహరించి నవంబర్ 27న జరుగనున్న కేసు విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ థరూర్‌కు వ్యతిరేకంగా రూ. 5,000 మొత్తంతో పాటు వారెంట్‌ను, అతని జామీనుదారుడికి నోటీసును జారీ చేయడం జరిగిందని కోర్టు తెలిపింది.