క్రైమ్/లీగల్

విహారయాత్రలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, నవంబర్ 11: విద్యార్థుల విహార త్ర విషాదంగా మారింది. హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇంద్రానగర్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలు కాగా మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 14 మంది విద్యార్ధులు రెండు కార్లలో బయలుదేరి బాపట్ల బీచ్‌కు విహారయాత్ర కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఒక కారు ముందు వెళ్తున్న లారీని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న రేవంత్ (23), హర్ష (23) అక్కడిక్కడే దుర్మరణం పాలుకాగా కారులో ఉన్న నిఖిల్, ఈశ్వర్, ప్రణీష్, హషిత్, శశాంక్ (24) తీవ్రంగా గాయపడగా వీరిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి 108 ద్వారా తరలిస్తుండగా శశాంక్ మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా మృతుల్లో రేవంత్ హైదరాబాద్‌లోని చంపాపేట్ కాగా హర్ష బాలాపూర్‌వాసి, శశాంక్ కొత్తపేటవాసిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణగౌడ్ తెలిపారు.