క్రైమ్/లీగల్

ఎనిమిదేళ్ల చిన్నారి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, నవంబర్ 11: ఎనిమిదేళ్ల బాలికను అపహరించిన పక్కింటి వ్యక్తి ఆమెను దారుణంగా హతమార్చిన ఘోరం సోమవారం వెలుగుచూసింది. విజయవాడ నగర శివారు నల్లకుంట గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను పక్కింటి వ్యక్తి గొంతునులిమి హతమార్చి బియ్యం గోతాములో మూటగట్టాడు. ఆదివారం సాయంత్రం బాలిక అదృశ్యమైనట్లు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం బాలిక మృతదేహం బయటపడింది. నల్లకుంట గ్రామంలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న మువ్వా ద్వారం (8) ఆదివారం మధ్యాహ్నం నుండి అదృశ్యమైంది. పోలీసులకు ఫిర్యాదు అందగానే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం సాయంత్రం పొరుగున ఉంటున్న మేకల ప్రకాష్ ఇంట్లోనే గోనె సంచిలో ఆమె మృతదేహం బయల్పడింది. నిందితుడు ప్రకాష్ అతని భార్య సోమవారం గొడవపడ్డారు. ఆ గొడవల్లో ఇద్దరూ ఒకరినొకరు తోసుకోగా ప్రకాష్ ఏటీఎం కార్డు బీరువా కింద పడింది. దాన్ని తీయడానికి ప్రకాష్ భార్య ప్రయత్నించగా, బాలిక మృతదేహం ఉన్న గోతాము కనపడింది. దీంతో ఆమె బిగ్గరగా అరుస్తూ బయటకు పరుగులు తీసింది. సమాచారం అందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న సరికే స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. నిందితుడు ప్రకాష్‌ను భవానీపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ ఎసీపీ కే సుధాకర్ ఆధ్వర్యంలో భవానీపురం సీఐ డీకే మోహన్‌రెడ్డి పోలీసుల బృందం గాలింపు చర్యలు చేపట్టగా నిందితుడు కూడా పోలీసుల వెంటే ఉండి వారితో పాటు వెతుకుతున్నట్లు నటించటం విశేషం. ప్రకాష్ భార్యకి అతనికి గొడవ జరగడం వల్ల ఈ ఘోరం వెలుగు చూసింది. పోలీసులు సోమవారం ఉదయం నుండి డ్రోన్ కెమెరాల సాయంతో చెట్లు, పుట్టలు వాడవాడలా గాలించారు. చివరకు పక్కింటిలోనే విగతజీవిగా బయటపడటంతో తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు, ఆ ప్రాంతాలునివారంతా కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని తమకు అప్పగించాలని అతడిని చంపేయాలని స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. అయితే పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి నిందితుడు ప్రకాష్‌ని భవానీపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాలిక హత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరులో ఐదేళ్ల చిన్నారి హత్యోదంతంపై దర్యాప్తు కొనసాగుతుండగానే విజయవాడ శివారు గ్రామం నల్లకుంటలో ద్వారక హత్య సంచలనం సృష్టించింది. బాలిక హత్య కేసులో నిందితుడు నుండి నిజాలు రాబడుతున్నామని గ్రామస్థుల నుండి భిన్న కథనాలు విన్పిస్తున్నాయని సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు.
*చిత్రాలు.. ... దారుణ హత్యకు గురైన మువ్వా ద్వారక (ఫైల్‌ఫొటో )
*నిందితుడు ప్రకాష్