క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: మున్సిపల్ ఎన్నికలను తక్షణమే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సోమవారం దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై ఈ నెల 30న విచారణ జరపనున్నట్టు హైకోర్టు పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గతంలో దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటికే వివిధ బెంచ్‌ల ముందు ఈ ఎన్నికలపై స్టే ఉత్తర్వులు ఉండటంతో వాటిని తొలగించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్టే విధిస్తూ ప్రభుత్వ కౌంటర్‌ను సమర్పించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలుచేయలేదని, కౌంటర్లు దాఖలు చేసిన తర్వాతనే స్టే ఉత్తర్వులను తొలగించాలని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు.
దాంతో ఆ అంశంపై తదుపరి విచారణ వాయిదా పడింది. మరో పక్క కొత్త పిటిషన్ దాఖలు కావడంతో ఈ నెల 30న తదుపరి విచారణ జరగనుంది.