క్రైమ్/లీగల్

లోకో పైలట్ తప్పిదమే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాచిగూడలో సోమవారం రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఎంఎంటీఎస్ రైల్ లోకో పైలట్ శేఖర్‌దే తప్పిదమని ప్రాథమిక
విచారణలో తేలిందని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. ఎంఎంటీఎస్ రైల్ వేగంగా వచ్చి ఢీకొట్టి ఉంటే ఘోర ప్రమాదం జరిగేదని, కానీ అదృష్టవశాత్తూ తక్కువ వేగంతో రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. రైళ్లు ఢీకొన్న ఘటనపై విచారణకు రైల్వే సేఫ్టీ కమిషనర్ రాంకృపాల్ నేతృత్వంలో ఈనెల 13న విచారణ జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు ఢీకొన్న ఘటనపై మానవ తప్పిదమా? లేక సాంకేతిక తప్పిదమా? అన్నది విచారణలో వెల్లడికానున్నదని వారు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కాచిగూడలో ప్రయాణికులతో విచారిస్తారు. అదేవిధంగా హైదరాబాద్ డీఆర్‌ఎంఎంలో కాచిగూడ స్టేషన్ అధికారులతో పాటు స్టేషన్‌లో పనిచేసే సాంకేతిక సిబ్బందిని సైతం విచారిస్తారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. థర్డ్ పార్టీతో విచారణ జరిపితే ఘటనపై వాస్తవాలు వెలుగుచూస్తాయని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సివిల్ ఏవియేషన్ నేతృత్వంలో విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10.45 గంటల సమయంలో కర్నూలు హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ సికిందరాబాద్‌కు వస్తూ కాచిగూడ స్టేషన్‌లో ఆగింది. అదే సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళుతున్న ఎంఎంటీఎస్ రైలు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఎంఎంటీఎస్ రైలుకు సిగ్నల్ ఇవ్వకముందే లోకో పైలట్ శేఖర్ రైలును స్టేషన్‌లోకి తీసుకురావడంతో ఎదురుగా ఉన్న ఇంటర్ సిటీని ఢీకొట్టింది. దీంతో ఎంఎంటీఎస్ రైలు మూడు బోగీలు ధ్వంసం కాగా, మరో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు ఢీకొన్న సందర్భంగా భారీ కుదుపు రావడంతో ఎంఎంటీఎస్ రైలులోని కొందరు ప్రయాణికులు పట్టాలపై పడ్డారు. మరికొంతమంది రైలు దిగి పరుగులు తీశారు. ఈ సందర్భంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే అధికారులు హుటాహుటిన క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో అక్కడ వేచివున్న ప్రయాణికులు భయాందోళనతో పరుగులు తీశారు. క్షణంలో ఏమి జరిగిందోనన్న విషయం కూడా రైల్వే అధికారులకు సైతం అంతుపట్టలేదు. అధికారులు కూడా స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి సంఘటన జరిగిన ప్రదేశం వైపు పరుగులు తీశారు. రైళ్లు ఢీకొన్న విషయం గురించి స్టేషన్ మేనేజర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన కాచిగూడకు చేరుకున్నారు. కాగా, రెండు రైళ్లు ఢీకొనడంతో ఎంఎంటీఎస్ లోకో పైలట్ శేఖర్ ఇంజన్‌లో ఇరుక్కుపోయారు. అతనిని బయటకు తీసుకురావడానికి 8 గంటల పాటు రైల్వే రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది శ్రమించి, బయటకు తీసుకువచ్చారు. తీవ్ర గాయాలపాలైన అతనిని చికిత్స కోసం కేర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కాచిగూడ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను 3 గంటల పాటు ఆలస్యంగా నడిపారు. ఈనెల 12వ తేదీన కూడా కాచిగూడ నుంచి బయలుదేరే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. కాచిగూడకు వచ్చీపోయే రైళ్లను సికిందరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు దారి మళ్లించారు. లోకో పైలట్ శేఖర్‌పై కేసు నమోదు చేశారు.
*చిత్రం...
ఎంఎంటీఎస్ రైలు ఇంజన్‌లో చిక్కుకు పోయిన డ్రైవర్‌ను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న సహాయక సిబ్బంది