క్రైమ్/లీగల్

రోగం, వైద్యం ఆధారంగానే చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలన్నీ ఒకే విధమైన చార్జీలు వర్తింపజేయాలన్న నిబంధన ఏ రకంగా చూసినా సరికాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా ఆసుపత్రులు, నర్సింగ్‌హోం రోగి అనారోగ్యం, దాని తీవ్రత, అందించే సదుపాయాలు ఆధారంగా ఆయా యాజమాన్యాలు ధరలు నిర్ణయించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు ప్రజల నుంచి ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, సీ హరిశంకర్‌ల ధర్మాసనం స్వచ్ఛంద సంస్థల పిటిషన్‌ను విచారించింది. వాదోపవాదాల అనంతరం ఆయా యాజమాన్యాలు అందించే సౌకర్యాలు, వ్యాధి తీవ్రత, అందించే వైద్యం నాణ్యత ఆధారంగా చార్జీలు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో రోగులను దోపిడీ చేస్తూ చార్జీలు వసూలు చేస్తున్నాయని.. దీనిని నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ మహిళా సాధికారతకు సంబంధించిన లీగల్ ఫోరం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఆయా ఆసుపత్రుల్లో జరుగుతున్న అవకతవకలపై నిఘా ఉంచాలని కూడా పిల్‌లో పేర్కొన్నారు. అయితే, వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ‘ఆయా నర్సింగ్ హోంలు, ప్రైవేటు ఆసుపత్రులు రోగి వ్యాధి, అందించే వైద్యం, కల్పించే సౌకర్యాలు ఆధారంగా ఫీజలు వసూలు చేస్తాయని’ పేర్కొంది.ఆసుపత్రులు, నర్సింగ్ హోంలకు ఒకే విధమైన చార్జీలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించలేమని పేర్కొంటూ పిల్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.