క్రైమ్/లీగల్

సకల నేరస్తుల సర్వేపై హైకోర్టు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ పోలీసులు నిర్వహించిన సకల నేరస్తుల సర్వేపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలోని నేరస్తులు, నేరచరితుల వివరాలు సేకరించేందుకు పోలీసులు ఇటీవల సకల నేరస్తుల సర్వేను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇలా నేరస్తుల వివరాలను సేకరించడంపై హైకోర్టు కనె్నర్ర చేయడంతో ఇక నుండి ఇలాంటి సర్వే చేయబోమని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి నివేదించారు. ఈ విషయంలో ఎవరైనా తమ డేటా దుర్వినియోగం అయిందని భావిస్తే తమ వద్దకు రావచ్చని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. సకల నేరస్తుల సమగ్ర సర్వేలో ఇబ్బందికర ప్రశ్నలు ఉన్నాయని గతంలో హఫీజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ సోమవారం నాడు కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా డిసిపి (డిడి, సిసిఎస్) అవినాష్ మహంతి స్వయంగా కోర్టుకు హాజరై , అభ్యంతరకర ప్రశ్నలు సమగ్ర సర్వే నుండి తొలగిస్తున్నామని హైకోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం కేసును క్లోజ్ చేసింది.