క్రైమ్/లీగల్

ఏడు హాస్టళ్ల కిచెన్‌లు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: కుళ్లిన కూరగాయలు..ఫ్రిజ్‌లో ఆహారం నిల్వ..పత్తాలేని సిల్ట్ చాంబర్లతో అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న ఏడు హాస్టళ్లలోని కిచెన్‌లను జీహెచ్‌ఎంసీ అధికారులు బుధవారం సీజ్ చేశారు. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌లలోని పలు హాస్టళ్లలో జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ డా.్భర్గవ నారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. హాస్టళ్లలోని కిచెన్‌లను, అక్కడ నెలకొన్న పరిస్థితును కూడా ఆశ్చర్యపడ్డారు. ప్రతి హాస్టల్‌లోని వ్యర్థాలను వేసేందుకు ప్రత్యేకంగా సిల్ట్ చాంబర్లను నిర్మించుకోవాలని గతంలోనే జలమండలి అధికారులు సూచించినా, వారి ఆదేశాలను లెక్కచేయకుండా సిల్ట్‌చాంబర్‌లను నిర్మించుకోకుండా వ్యర్థాలను నాలాల్లో వేయటంతో మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. మరికొన్ని హాస్టళ్లకు ట్రేడ్ లైసెన్సులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించి జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా పరిస్థితులను చక్కదిద్దని కిచెన్‌లు కూడా సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి. బుధవారం సీజ్ చేసిన వాటిల్లో ఒక లేడీస్ హాస్టల్ ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ భార్గవ నారాయణ వెల్లడించారు.