క్రైమ్/లీగల్

ఇంత నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణలో డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, ఇతర విషజ్వరాలతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నా స్పందించరా? అంటూ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత నిర్లక్ష్యమా? అని నిలదీసింది. విషజ్వరాల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదా? స్పందించరా? అంటూ ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ తీరుపై
అసంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం నాటి తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆరోగ్య శాఖ, వైద్య శాఖ, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. డెంగ్యూపై చర్యలు తీసుకుని మరణాలను ఆపాలని న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ కొనసాగించింది. గత వారం హైకోర్టు పిటిషన్ విచారిస్తూ ప్రభుత్వాన్ని తగిన చర్యలు చేపట్టమని ఆదేశించినా, ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రజల్లో విషజ్వరాలపై అవగాహన కల్పించేందుకు సరైన చర్యలు చేపట్టలేదని మండిపడింది. విషజ్వరాల నివారణకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలతో కూడిన నివేదికను కోర్టు ముందుంచాలని ఇచ్చిన ఆదేశాల మేరకు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ నివేదికను సీజే ముందుంచారు. విషజ్వరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని పేర్కొంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, హోర్డింగ్‌లూ ఎక్కడా ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించింది. డెంగ్యూ మరణాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని సీజే వ్యాఖ్యానించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు సంబంధిత ఉన్నతాధికారులు గురువారం నాడు కోర్టుముందు హాజరుకావాలని ఆదేశించారు. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.