క్రైమ్/లీగల్

శివకుమార్‌కు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: మనీ ల్యాండరింగ్ కేసులో కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఢిల్లీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 26 లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాలని, ఇద్దరు సాక్షులను చూపించాలని, దేశం విడిచి వెళ్ళరాదని తెలిపింది. దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని హెచ్చరించింది. శివకుమార్ (57) కోట్లాది రూపాయల పన్నులు ఎగవేశారన్న ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు సెప్టెంబర్ 3న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా శివకుమార్‌కు బెయిల్ ఇవ్వరాదని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. శివకుమార్ పలుకుబడి గల వ్యక్తి అని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని తెలిపారు. శివకుమార్ హవాలా ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు చేశారని, పన్ను ఎగవేతదారుడని ఆదాయపు పన్ను శాఖ గత ఏడాది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ముందు ఛార్జీషీట్ దాఖలు చేసింది.