క్రైమ్/లీగల్

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మహిళా ఐఏఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 23: సైబర్ నేరగాళ్ళ ఉచ్చులోపడి ఓ ఐఏఎస్ అధికారిణి ఆరు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు వచ్చిన ఓ నకిలీ ఫోన్‌కాల్‌కు అధికారిణి దొరిపోయారు. ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) నకిలీ మొబైల్ కాల్‌కి స్పందించిన ఆమె తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 6.10 లక్షల రూపాయలు నష్టపోయారు. డాక్టర్ టీ శుభమంగళ ఉదయ్‌పూర్ జిల్లా జోడోల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఆమె మొబైల్ ఫోన్‌కు ఈనెల 21న ఓ మెస్సేజ్ వచ్చింది. అందులో అడిగిన ప్రకారం వివరాలన్నీ అందజేశారు. కేవైసీలో బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చేశారు. అంతే క్షణాల్లో 6.10 లక్షల రూపాయలు విత్‌డ్రా అయిపోయాయి. మూడు విడతల్లో సొమ్ములు విత్‌డ్రా చేసేసుకున్నారని శుభమంగళ తెలిపారు. మోసపోయానని తెలుసుకున్న ఆమె వెంటనే జోడోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బ్యాంక్ ఖాతా బెంగళూరు ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఉండడంతో అక్కడి సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పారు. ‘ఎవరికైనా ఇలాంటి మోసం జరగవచ్చు. నకిలీ ఫోన్‌కాల్స్, మెస్సేజ్‌లకు స్పందించవద్దు. ఎవరికీ వ్యక్తిగత సమాచారం ఇవ్వకండి. సైబర్ నేరాల కట్టడికి మరింత కఠినమైన చట్టాలు రావల్సి ఉంది’అని ఆమె అన్నారు.